: ఇద్దరు భారతీయ మహిళా 'నల్ల కుబేరుల' పేర్లు వెల్లడించిన స్విట్జర్లాండ్


స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న వారిలో కొన్ని దేశాల ఖాతాదారుల పేర్లను స్విట్జర్లాండ్ ప్రభుత్వం వెల్లడించగా, అందులో ఇద్దరు భారత మహిళల పేర్లు ఉన్నాయి. స్నేహలత సాహ్ని, సంగీత సాహ్నిలకు స్విస్ బ్యాంకులో అకౌంట్లున్నాయి. వీరి పుట్టిన తేదీ వివరాలు మినహా, మరే వివరాలను స్విస్ ప్రభుత్వం వెల్లడించలేదు. నల్ల కుబేరుల పేర్ల వెల్లడిలో భాగంగా స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ టీఏ) ఈ రెండు పేర్లను బయటపెట్టింది. వీరి పూర్తి వివరాలను బహిర్గతం చెయ్యరాదంటే, 30 రోజుల్లోగా ఎఫ్ టీఏ కోర్టుకు వీరు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపింది. వీరితో పాటు, బ్రిటిష్, స్పెయిన్, రష్యాలకు చెందిన నల్ల ఖాతాదారుల పేర్లను ఎఫ్‌టీఏ వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్‌లకు చెందిన వారి ఇనిషియెల్స్ మాత్రమే బయటపెట్టింది. మొత్తం 40 మంది వివరాలను స్విస్ ఫెడరల్ గెజిట్‌ లో ప్రచురించారు. భవిష్యత్తులో మరింత మంది వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News