: ఎమ్మెల్యేలు, మంత్రులు రౌడీల్లా తయారవుతున్నారు: రోజా
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ నేతలపై మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రౌడీల్లా తయారవుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీని, పార్టీ అధినేత జగన్ ను అణగదొక్కేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికార పక్ష నేతలు సమస్యలు సృష్టిస్తున్నారని, రాష్ట్రంలో విపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు. ఇవాళ ఆమె, ఎంపీ వరప్రసాద్ తో కలిసి చెన్నైలో సదరన్ రైల్వే జనరల్ మేనేజర్ అశోక్ అగర్వాల్, రైల్వే చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ అనంతరామన్ లతో భేటీ అయ్యారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.