: సొంత ఆఫీసులో కన్నడ హీరో రామ్ ఆత్మహత్యాయత్నం


బెంగళూరులో కన్నడ హీరో, నిర్మాత రామ్ సొంత ఆఫీసులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్నేహితులతో మాట్లాడుతూనే విషం సేవించి ప్రాణాలు తీసుకునేందుకు యత్నించాడు. అతడిని వెంటనే నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. రామ్ ఇటీవల ఆగిపోయిన ఓ సినిమా నిర్మాణాన్ని తలకెత్తుకున్నాడు. రౌడీయిజం బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు 'సిద్ధాపుర'. ఇందులో హీరోగా రామ్ నటిస్తున్నాడు. అయితే, సినిమా మధ్యలో నిర్మాత శ్రీనివాస్ చేతులెత్తేశాడు. దీంతో, సినిమా పూర్తి చేయాలని భావించిన రామ్ కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తీసుకుని సినిమా నిర్మాణంలో పెట్టాడు. చివరికి ఫ్రెండ్స్ వద్ద అప్పులు చేసినా సినిమా పూర్తి కాలేదు. దీంతో, కుంగిపోయిన రామ్ ఆత్మహత్యకు యత్నించాడు.

  • Loading...

More Telugu News