: ప్రభుత్వోద్యోగి చేత షూలేస్ కట్టించుకున్న బెంగాల్ మంత్రి


అనుచరుల సేవల్లో మునిగితేలే రాజకీయ నాయకులు, తమ దగ్గర పని చేసే ప్రభుత్వోద్యోగులను కూడా వదలడం లేదు. పశ్చిమ బెంగాల్ లోని మమతాబెనర్జీ మంత్రి వర్గంలో పనిచేస్తున్న రాచ్ పాల్ సింగ్ భద్రతా సిబ్బంది చేత షూలేస్ కట్టించుకున్నారు. పబ్లిక్ మీటింగ్ లో ఎలాంటి బెరుకూ లేకుండా ఆయన ఈ పని చేయించుకోవడం విశేషం. సచివాలయంలో ఉన్న ఆర్టిస్ట్ రామ్ కింకర్ బేజ్ చిత్రపటానికి పూలమాల వేసిన సందర్భంలో ఆయన షూ విడిచారు. అనంతరం ఆయన తన భద్రతా సిబ్బంది చేత షూలేస్ కట్టించుకున్నారు. దీనిపై సర్వత్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News