: ఆ ఫోటో సైజ్ 46 టెరాబైట్స్...ప్రపంచంలో అతిపెద్ద ఫోటో
ప్రపంచంలోనే పెద్ద ఫోటోను ఇటాలియన్ ఫోటో గ్రాఫర్ ఫిలిప్పో బ్లెంగిని తీశారు. ఆ ఫోటో తీసేందుకు ఆయనకు 35 గంటల సమయం పట్టింది. యూరప్ లోని మౌంట్ బ్లాక్ పర్వతం ప్రపంచంలోని ఎత్తైన పర్వతాల్లో 11వది. దీనిని ఫోటో తీయాలని ఫిలిప్పో భావించారు. ఫోటో అంటే అలాంటిలాంటి ఫోటో కాదు. అందులో పర్వతం మొత్తం ఇమిడిపోవాలి, అణువణువూ ఫోటోలో నిక్షిప్తం కావాలని ఆయన భావించారు. ఆ విధంగా ఆ ఫోటో తీసేందుకు ఆయన పూనుకున్నారు. దీంతో ఆయన తన కేనన్ కెమేరా వేసుకుని కొండ దగ్గరకు వెళ్లారు. దానిని 70,000 షాట్స్ గా తన కెమేరాలో నిక్షిప్తం చేశారు. పర్వతంలోని ప్రతి భాగాన్ని ఆయన తన కెమేరాలో బంధించారు. ఈ షాట్లను ఆరు నెలలపాటు శ్రమించి ఫోటో షాప్ లో కలిపి, దీనికి వాస్తవరూపం కల్పించారు. ఈ 70,000 షాట్ల మెమరీ 365 గిగా పిక్సెల్స్ అయితే, వాటన్నింటినీ కలిపిన అనంతరం దాని సైజు 46 టెరాబైట్స్ అయింది. దీంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫోటోగా రికార్డు సృష్టించింది.