: జూన్ 7న తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం ప్రకటన
తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని జూన్ 7న ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పరిశ్రమలు తరలివస్తే విద్యుత్ సమస్య లేకుండా చూస్తామని, 2017 నాటికి మిగులు విద్యుత్ సాధిస్తామని చెప్పారు. అయితే పారిశ్రామిక విధానం ద్వారా 15 రోజుల్లోనే కంపెనీలకు అన్ని అనుమతులు లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. టీఎస్ఐఐసీ దగ్గర 1.60 లక్షల ఎకరాల భూమి ఉందని, ఆ భూమిని పరిశ్రమలకు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కాగా, దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తల సమక్షంలో పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.