: కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి
మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఎమ్మెల్యే చిన్నారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఖిల్లాఘనపురంలో టీఆర్ఎస్ నేతలు ఓ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం అదే గ్రామంలో ఉన్న ఎంపీటీసీని ఆహ్వానించకపోవడంతో, ఆయన ప్రశ్నించారు. అడగడానికి నువ్వెవరు? అంటూ ఆ గ్రామ సర్పంచ్ అతనిపై దాడికి దిగారు. చెప్పుతో కూడా కొట్టడంతో, ఆవేదన చెందిన ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యే చిన్నారెడ్డికి ఫోన్ చేసి గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఖిల్లాఘనపురం చేరుకుని సర్పంచ్ ను ప్రశ్నించారు. దీంతో కొంతమంది యువకులు కర్రలతో చిన్నారెడ్డి, అతని అనుచరులపై దాడికి దిగారు. ఈ దాడిలో ఆయనకు, అనుచరులకు గాయాలయ్యాయి.