: 'విశుద్ధి మార్గం' గ్రంథాన్ని ఆవిష్కరించిన కేసీఆర్... హాజరైన బౌద్ధ భిక్షువులు


గౌతమ బుద్ధుడి బోధనలు మానవాళికి మార్గనిర్దేశం చేస్తాయని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుద్ధుడి బోధనలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని... దీనికోసం బౌద్ధ సాహిత్యం దోహదపడుతుందని చెప్పారు. ఈ రోజు 'విశుద్ధి మార్గం' అనే గ్రంథాన్ని కేసీఆర్ తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి బౌద్ధ భిక్షువులు బుద్ధపాల, ధర్మపాల, మోక్షానందలు హాజరయ్యారు. ఆచార్య బుద్ధ ఘోషుడు క్రీ.శ. 4వ శతాబ్దంలో బౌద్ధ మూల గ్రంథాలను రచించారు. ఈ గ్రంథాలను 120 వాల్యూములుగా పాలి భాష నుంచి తెలుగులోకి అనువదిస్తున్నారు. హైదరాబాదులోని మహాబోధి సొసైటీ ఈ కార్యక్రమాన్ని (పాలి-తెలుగు త్రిపీఠక ప్రాజెక్టు) చేపట్టింది. ఇందులో భాగంగానే నేడు కేసీఆర్ తొలి గ్రంథాన్ని ఆవిష్కరించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి అనువాద గ్రంథాన్ని తీసుకొస్తామని ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు ఆంజనేయరెడ్డి, వీరనారాయణరెడ్డిలు తెలిపారు. ఈ గ్రంథాలను మోక్షానంద తెలుగులోకి అనువదించారు. మోక్షానంద నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News