: రాహుల్ కు ఉల్లిగడ్డకు, పిజ్జాకు మధ్య తేడా కూడా తెలియదు: నఖ్వీ సెటైర్లు


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మండిపడ్డారు. ఉల్లిగడ్డ అంటే కూడా తెలియని రాహుల్ రైతు నాయకుడిగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. రాహుల్ కు ఉల్లిగడ్డలు, బర్గర్లు, పిజ్జాలు, వంకాయలకు మధ్య ఉన్న తేడా కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ పతిష్ఠ పెరిగిందని... బీజేపీని దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్న రాహుల్ ఎన్నటికీ సఫలం కాలేరని చెప్పారు.

  • Loading...

More Telugu News