: ఓయూ భూములపై కేసీఆర్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలి: చెరుకు సుధాకర్
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఖాళీ భూములపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై తెలంగాణ ఉద్యమ వేదిక చైర్మన్ చెరుకు సుధాకర్ స్పందించారు. సీఎం ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓయూ విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం అమానుషమని, ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఈ రోజు తెలంగాణ ఉద్యమ వేదిక విద్యార్థి నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హాజరైన సుధాకర్ పైవిధంగా మాట్లాడారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉద్యమాలు చేస్తామని, ప్రభుత్వంపై ఎలాంటి పోరాటం చేయాలో ఆలోచిస్తున్నామని వివరించారు.