: అవి చెడ్డ రోజులు కావా?... వాళ్లు చేసినవి చెడ్డ పనులు కావా?: మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధుర సభలో ఆవేశంగా ప్రసంగించారు. యూపీఏ పాలనలో చోటుచేసుకున్న కుంభకోణాలను మరోసారి ఎత్తిచూపారు. గతంలో దేశాన్ని దోచుకున్నవారికి ఇక మూడినట్టేనని హెచ్చరించారు. యూపీఏ పాలనలో స్కాం జరగని రోజంటూ లేదని విమర్శించారు. అవి చెడ్డ రోజులు కావా?... వాళ్లు చేసినవి చెడ్డ పనులు కావా? అని ప్రశ్నించారు. వారి పాలన అంతా అవినీతిమయమని అన్నారు. యూపీఏ సర్కారు రిమోట్ కంట్రోల్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ఎన్డీయే అధికారం చేపట్టకుంటే దేశం పరిస్థితి ఎలా ఉండేదో చెప్పండని సభకు వచ్చిన ప్రజలను అడిగారు. విచ్చలవిడిగా సాగిన దోపిడీకి తమ రాకతో అడ్డుకట్ట పడిందని మోదీ స్పష్టం చేశారు.