: ఢిల్లీలో కేంద్రానికి ఎదురుదెబ్బ... లెఫ్టినెంట్ గవర్నర్ కు ఆ అధికారం లేదని స్పష్టం చేసిన హైకోర్టు


లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీలో అధికారం చెలాయించాలని చూస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఏసీబీ అధికారులు ఢిల్లీ ప్రభుత్వ అధీనంలోనే ఉంటారని, లెప్టినెంట్ గవర్నర్ పరిధిలో కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఎల్జీ ఆదేశాలను అధికారులు పాటించవద్దని తెలిపింది. అంతేగాక లెఫ్టినెంట్ గవర్నర్ తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించకూడదని కోర్టు పేర్కొంది. కోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, ఢిల్లీ ప్రభుత్వాన్ని బలహీనపర్చాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నానికి కోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం విషయంలో కేజ్రీవాల్, ఎల్జీ నజీబ్ జంగ్ కు మధ్య జగడం నడుస్తోంది. ఈ సమయంలో ఎల్జీ నియమించిన వ్యక్తినే సీఎస్ గా కేంద్రం ఖరారు చేసింది. దాంతో కేజ్రీ తీవ్రంగా వ్యతిరేకించి ప్రధానమంత్రికి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలోనే కేజ్రీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News