: ఆయన స్ఫూర్తిని కొనసాగిద్దాం: మోదీ


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని మధురలో 'జన్ కల్యాణ్ పర్వ' సభలో ప్రసంగించారు. శ్రీకృష్ణుడు జన్మించిన పుణ్యస్థలం మధుర అని స్థానికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అనంతరం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ నినాదాన్ని గుర్తు చేశారు. 'అలసిపోవద్దు, ఆగిపోవద్దు, లొంగిపోవద్దు... కేవలం మన పని మనం పనిచేసుకుంటూ వెళ్లాలి' అన్న దీన్ దయాళ్ స్ఫూర్తితో ముందుకెళదామని పిలుపునిచ్చారు. గాంధీ, లోహియా, దీన్ దయాళ్ ల ఆలోచనలను పంచుకుందామని సూచించారు. తన ఏడాది పాలనను కూడా మోదీ ఈ సభలో ప్రస్తావించారు. ఎన్డీయే సర్కారు పాలనకు ఏడాది పూర్తయిందని, ఎలాంటి అవినీతి జరగలేదని అన్నారు. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News