: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు... యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ప్రభావం


యూఎస్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతోందన్న వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. దీంతో, భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 314 పాయింట్లు పతనమై 27,644కు పడిపోయింది. నిఫ్టీ 89 పాయింట్లు కోల్పోయి 8,370 దగ్గర స్థిరపడింది. కైలాశ్ ఆటో ఫైనాన్స్, మ్యాక్స్ ఇండియా లిమిటెడ్, బేయర్ క్రాప్ సైన్స్, డిష్ టీవీ ఇండియా, సిటీ యూనియన్ బ్యాంకులు టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇండియన్ హోటల్స్, ఇన్ఫో ఎడ్జ్ ఇండియా, టెక్ మహీంద్రా, రతన్ ఇండియా పవర్, కెనరా బ్యాంక్ లు నష్టపోయిన కంపెనీల జాబితాలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News