: బ్యాటింగ్ లో సత్తాచాటిన రహానే, శ్రేయస్ అయ్యర్


ఐపీఎల్ సీజన్-8లో విదేశీ ఆటగాళ్లతో పాటు భారత ఆటగాళ్లు కూడా సత్తాచాటారు. ముఖ్యంగా, రహానే, శ్రేయస్ అయ్యర్ లు ఐపీఎల్ సీజన్ లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించి వార్తల్లో నిలిచారు. భారీ షాట్లతోనే కాకుండా బెస్ట్ ప్లేస్ మెంట్ తో స్కోరు బోర్డును ఉరకలెత్తించవచ్చని వారు నిరూపించారు. వీరికి తోడు హార్డిక్ పాండ్య, అక్షర పటేల్ లు టైలెండర్లుగా వచ్చి భారీ షాట్లతో విరుచుకుపడి భవిష్యత్ పై ఆశలు రేపారు. మిడిల్ ఆర్డర్ లో అంబటి రాయుడు, మనీష్ పాండే, మమాంఖ్ అగర్వాల్ ఐపీఎల్ ను మరింత రక్తికట్టించారు. భారత దేశవాళీ ఆటగాళ్లు రాణించి సత్తాచాటిన చోట సీనియర్లు చతికలపడ్డారు. ఎన్నో ఆశలతో బరిలో దిగిన సెహ్వాగ్, యువీ, దినేష్ కార్తిక్ లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. విదేశీ ఆటగాళ్లు మాత్రం తమపై జట్టు యాజమాన్యాలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టారు. డివిలియర్స్, మెక్ కల్లమ్, గేల్, వార్నర్, డుప్లెసిస్, మైక్ హస్సీ, డ్వెన్ బ్రావో, లెండిల్ సిమ్మన్స్, కీరన్ పొలార్డ్ సత్తాచాటి ఆటకు వన్నెతెచ్చారు. ఏబీ డివిలియర్స్ సెంచరీ సాయంతో అత్యధిక వ్యక్తిగత స్కోరు(133) చేసిన ఆటగాడిగా నిలిచాడు. సీజన్ టాప్ స్కోరర్ గా హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్( 562) నిలిచాడు. ఎమర్జింగ్ ప్లేయర్ గా శ్రేయస్ అయ్యర్ పదిలక్షల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News