: ఈసారి స్పిన్నర్ల పప్పులు ఉడకలేదు!


ఇంతవరకు ఐపీఎల్ అంటే స్పిన్నర్ల రాజ్యంగా సాగేది. ఊరించే బంతులతో బ్యాట్స్ మన్ ను బోల్తా కొట్టించే స్పిన్నర్ల పప్పులు ఈసారి ఉడకలేదు. గత సీజన్లలో కుంబ్లే, హర్బజన్, మురళీ కార్తిక్, పటేల్, కరణ్ శర్మ, సునీల్ నరైన్, అశ్విన్, చాహల్, హాగ్ వంటి వారు సత్తా చాటారు. అయితే ఈసారి ఐపీఎల్ లో స్పిన్నర్లు సత్తాచాటినా వారికి వికెట్లు పడలేదు. స్పిన్నర్లకంటే పేస్, స్వింగ్ బౌలర్లే సత్తాచాటారు. ఈ ఐపీఎల్ లో 686 వికెట్లు పడ్డాయి. మిచెల్ స్టార్క్ సంధించిన బంతి 151.11 కేపీహెచ్ వేగంతో ప్రయాణించింది. ఈ ఐపీఎల్ లో టీమిండియా వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా బెస్ట్ బౌలింగ్ (4/10) గణాంకాలు నమోదు చేశాడు. డ్వెన్ బ్రేవో ఈ సీజన్ లో 26 వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు. దీంతో అతనిని ఐపీఎల్ 10లక్షల రూపాయల నజరానాతో సత్కరించింది. అతని తరువాతి స్థానాల్లో భువనేశ్వర్ కుమార్ వంటి వారు నిలవడం విశేషం.

  • Loading...

More Telugu News