: ఏపీ రాజధానిలో విమానాశ్రయం కోసం 5 వేల ఎకరాలు
ప్రస్తుతం ఏపీ రాజధానికి గన్నవరంలో ఉన్న చిన్న విమానాశ్రయమే దిక్కు. అయితే, నూతనంగా నిర్మించబోతున్న రాజధానిలో మాత్రం అంతర్జాతీయ విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాజధాని ప్రణాళిక గురించి ఈరోజు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలను కేటాయించాలని సూచించారు. దానికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోని అన్ని రహదారులు రాజధానితో అనుసంధానం కావాలని, పర్యాటకానికి పెద్ద పీట వేయాలని ఈశ్వరన్ సూచించారు. 219 కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమయింది. 124 కిలోమీటర్ల మేర ఎక్స్ ప్రెస్, సెమీ ఎక్స్ ప్రెస్ రహదారులు నిర్మిచనున్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణా నదిపై మరో 4 వంతెనలు నిర్మించనున్నారు. రాజధానికి మూడు జాతీయ రహదారులను (ఎన్ హెచ్-5, ఎన్ హెచ్-9, ఎన్ హెచ్-221) కలుపుతున్నారు.