: ఉస్మానియా భూములను రక్షించండి... లోకాయుక్తలో ఓయూ జేఏసీ పిటిషన్
ఉస్మానియా విశ్వవిద్యాలయ ఖాళీ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో ఓయూ జేఏసీ అప్రమత్తమైంది. భూములను పరిరక్షించాలని కోరుతూ లోకాయుక్తలో పిటిషన్ దాఖలు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఓయూ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సరికాదని జేఏసీ నేతలు తెలిపారు. ఉస్మానియా స్వయం ప్రతిపత్తి ఉన్న విశ్వవిద్యాలయమని, ఇందులో రాజకీయ సంబంధిత నివాసాలకుగానీ, ప్రైవేటు వ్యక్తులకుగానీ ఇచ్చే అధికారాలు ఎవరికీ లేవని పిటిషన్ లో స్పష్టం చేశారు. ఈ విషయంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి, ప్రిన్సిపల్ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఓయూ వీసీ, రిజిస్ట్రార్ బాధ్యులను చేయాలని లోకాయుక్తను కోరారు. ఈ భూములపై కేసీఆర్ చేసిన ప్రకటనను కూడా పిటిషన్ లో పేర్కొన్నారు.