: పొలాలు, విల్లాలు వద్దు... అపార్ట్ మెంట్లే ముద్దు అంటున్న ఎన్నారైలు: సర్వే రిపోర్ట్


విదేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలలో చాలా మంది సొంత దేశంలో అపార్ట్ మెంట్లు కొనుక్కోవడమే బెటర్ అంటున్నారు. స్థలాలు, పొలాలు, విల్లాలు, ఇండిపెండెంట్ హౌస్ లు ఇవేవీ వద్దంటున్నారు. అపార్ట్ మెంట్లు కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే, గేటెడ్ కమ్యూనిటీల్లో సెక్యూరిటీతో పాటు, క్లబ్ హౌస్, గార్డెన్, నిర్వహణలో ఇబ్బంది లేకపోవడం, ఒక వేళ రెంట్ కు ఇస్తే అద్దె వసూళ్లలో సౌలభ్యం లాంటివన్నీ ఉంటాయని ఎన్నారైలు భావిస్తున్నారు. అయితే వారి టాప్ ప్రయారిటీ మాత్రం బెంగళూరేనట. ఆ తర్వాత వరుసలో ముంబై, చెన్నై, పూణె, కొచ్చి, ఢిల్లీ, హైదరాబాద్, గోవా, అహ్మదాబాద్ ఉన్నాయట. ఈ విషయాలన్నీ ఓ సర్వే సంస్థ వెల్లడించింది. వచ్చే నెలలో జరగబోయే ఇండియన్ ప్రాపర్టీ షో సందర్భంగా ఈ సర్వే నిర్వహించారు.

  • Loading...

More Telugu News