: మొత్తం 2,645 ఫోర్లు, 692 సిక్స్ లు
ఐపీఎల్ సీజన్-8 లో స్కోరు బోర్డుపై నమోదైన పరుగులు అక్షరాల 18,332. ఇందులో కేవలం బౌండరీలే 2,645. వీటి ద్వారా 10,580 పరుగులు స్కోరు బోర్డుపై నమోదయ్యాయి. మొత్తం 692 సార్లు ఆటగాళ్లు బంతిని సిక్సులుగా నేరుగా స్టాండ్స్ లోకి తరలించారు. దీంతో 4,152 పరుగులు కేవలం సిక్సుల రూపంలో స్కోరు బోర్డుపై వచ్చి చేరాయి. ఈ మొత్తం పరుగుల్లో 89 అర్ధ సెంచరీలుండగా, కేవలం నాలుగే సెంచరీలు నమోదయ్యాయి. ఈ సీజన్ లో ఒక్క భారతీయుడూ సెంచరీ సాధించకపోవడం విశేషం. 'సిక్సర్ల' క్రిస్ గేల్ 38 సార్లు బంతిని నేరుగా సిక్సులుగా బౌండరీ దాటించాడు. ఇందుకు అతనికి 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందజేయడం విశేషం. ఈసారి సిక్స్ ల పరంగా బంతి 108 మీటర్ల దూరం ప్రయాణించింది.