: భారత్ పై మరోసారి విషం కక్కిన హఫీజ్ సయీద్
ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ మరోసారి భారత్ పై విషం కక్కాడు. పాకిస్థాన్ ఎదుగుదలను చూసి భారత్ ఓర్వలేకపోతోందని అన్నాడు. వందల కోట్ల విలువైన చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)కు భారత్ వ్యతిరేకమని, ఆ ఒప్పందానికి గండికొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించాడు. పెషావర్ లోని ఓ మదరసాలో సర్టిఫికెట్ ప్రదానోత్సవంలో మాట్లాడుతూ సయీద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ ఒప్పందాన్ని నీరుగార్చేందుకు భారత్ కు చెందిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిందని కూడా ఈ జమాత్-ఉద్-దవా చీఫ్ ఆరోపించాడు.