: నేనలా అనలేదు.. ప్రత్యేక హోదాపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా: వెంకయ్యనాయుడు


ప్రత్యేక హోదాకు కావాల్సిన అర్హతలు ఏపీకి లేవని తాను అన్నానంటూ వచ్చిన వార్తలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. తానస్సలు అలా అనలేదని చెప్పారు. హోదాపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని ఢిల్లీలో అన్నారు. గాడ్గిల్ ఫార్ములా కొలమానాల పరిధిలో ఏపీ లేదన్న వెంకయ్య, హోదాపై విభజన సమయంలోనే బిల్లులో చేర్చి ఉంటే బాగుండేని వ్యాఖ్యానించారు. రెవెన్యూ లోటు ఉన్నందున ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, దానిపై కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే ఏపీ ఆర్థికలోటు భర్తీ చేస్తామని హామీ ఇచ్చామన్నారు. అటు బిల్లులో చేర్చకపోయినా ఏపీకి హోదాపై ఎన్టీయే ప్రభుత్వం సానుకూలంగా పరిశీలన జరుపుతుందని వెంకయ్య చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News