: పేద వ్యక్తి ప్రధాని కావడాన్ని రాహుల్ తట్టుకోలేకపోతున్నారు: కిషన్ రెడ్డి


ప్రధాని పదవికే నరేంద్ర మోదీ వన్నె తెచ్చారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆకాశానికి ఎత్తేశారు. ఏడాది పాలనలో దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారని కొనియాడారు. నల్లధనాన్ని వెనక్కు తీసుకురావడానికి సిట్ వేశారని... విదేశీ పెట్టుబడులను తీసుకురావడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఓ పేద వ్యక్తి ప్రధాని కావడాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తట్టుకోలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు. రాహుల్ తో పాటు వామపక్షాలు మోదీ పాలనకు సున్నా మార్కులు వేశాయని... అయితే, వారి మార్కులు తమకు అవసరం లేదని చెప్పారు. తెలంగాణకు కూడా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ఇచ్చిందని తెలిపారు.

  • Loading...

More Telugu News