: ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయనున్న టి.సుబ్బరామిరెడ్డి


ఏపీకి ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బరామిరెడ్డి దీక్ష చేపట్టనున్నారు. జూన్ 6న రాజమండ్రిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే, జూన్ 3న విశాఖపట్నం, 4న విజయనగరం, 5న శ్రీకాకుళం జిల్లాల్లో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా దక్కేంతవరకు కాంగ్రెస్ పార్టీ నిదురపోదని ఎన్డీయే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే, విశాఖలోని 'విమ్స్'ను 'ఎయిమ్స్'గా మార్చాలని, ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News