: మళ్లీ లైన్ లో పడ్డ ఒబామా... ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ
రోజురోజుకూ అమెరికా ప్రజల్లో ఆదరణ కోల్పోతున్న ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఊరట లభించింది. క్రమంగా ఆయనకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ఓ సర్వేలో తేలింది. వ్యక్తిగతంగా, పనితీరు పరంగా ఆయనకు ప్రజల్లో ఇమేజ్ పెరుగుతోందని సర్వే తేల్చింది. క్యూబాతో సంబంధాలను పెంపొందించుకోవడం, ఇరు పార్టీల ఎంపీల మధ్య సమన్వయం కుదర్చడం, వివిధ సామాజిక వర్గాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడంతో ఒబామా రేటింగ్ అమాంతంగా పెరిగింది. 2014 మధ్యంతర ఎన్నికల సమయంలో ఒబామా రేటింగ్ బాగా పడిపోయి, 50 శాతం కన్నా తక్కువకు పతనమైంది. ఒబామాకు రేటింగ్ పెరగడంతో, వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికల్లో... ఆయన పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ విజయావకాశాలు మెరుగుపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.