: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టుకు వెళ్లిన టీ.టీడీపీ


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న ఆరాటమో లేక టీఆర్ఎస్ ఐదో అభ్యర్థిని ఓడించాలన్న ఆలోచనతోనే పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై తెలంగాణ టీడీపీ న్యాయపోరాటానికి సిద్థమైంది. పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లోకి వెళ్లిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డిలపై ఉమ్మడి హైకోర్టులో టీ.టీడీపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి ఓటు హక్కు కల్పించకుండా అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్ లో కోరారు. తలసాని చేత గవర్నర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడమే ఫిరాయింపుకు అత్యుత్తమ సాక్ష్యమని కోర్టుకు వివరించారు.

  • Loading...

More Telugu News