: పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందే... ఆప్ 100 రోజుల వేడుకల్లో గళమెత్తనున్న కేజ్రీవాల్


ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్రంగా హోదాను ఇవ్వాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేయనున్నారు. ఢిల్లీలో పాలనా పగ్గాలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా నేడు ర్యాలీ, బహిరంగ సభను నిర్వహించనున్న ఆప్, ఈ వేదికపై నుంచి మోదీ సర్కారుపై, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పై తీవ్ర విమర్శలు చేసే అవకాశాలున్నాయి. కాగా, గత కొంత కాలంగా రాజ్యాంగ పరమైన సమస్యలతో ఢిల్లీలో పాలన సక్రమంగా సాగడం లేదన్న సంగతి తెలిసిందే. అధికారాలన్నీ తన పరిధిలోనే ఉండాలని లెఫ్టినెంట్ గవర్నర్ వాదిస్తుండగా, ఇక తామెందుకని ఆప్ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో 26 నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News