: భానుడి ప్రకోపానికి ఆదివారం నాడు 819 మంది బలి


భానుడి ప్రకోపం ఇప్పట్లో చల్లారేట్టు కనిపించడం లేదు. సూర్యుడి కిరణాల తీవ్రతకు తాళలేక తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఒక్కరోజులో 819 మంది మరణించారు. ఎండల తీవ్రత ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తుండగా, వేల సంఖ్యలో వడదెబ్బబారిన పడ్డారు. ఎండవేడిమికి తాళలేక తెలంగాణలో 249 మంది, ఆంధ్రప్రదేశ్ లో 470 మంది మృతి చెందినట్టు వార్తలు వెలువడ్డాయి. వరంగల్ జిల్లాలో అత్యధికంగా 57 మంది మృతి చెందగా, ఖమ్మం జిల్లాలో 46 మంది, నల్లగొండ జిల్లాలో 42 మంది, కరీంనగర్ జిల్లాలో 41 మంది, మహబూబ్‌ నగర్ జిల్లాలో 17 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 13 మంది, మెదక్ జిల్లాలో 11 మంది, రంగారెడ్డి జిల్లాలో 10 మంది, నిజామాబాద్ జిల్లాలో 8 మంది, హైదరాబాదులో ఆరుగురు మరణించారు. ఇక ఏపీలో ఒక్క ప్రకాశం జిల్లాలోనే 83 మంది, కృష్ణా జిల్లాలో 63 మంది, గుంటూరు, నెల్లూరులలో 60 మంది చొప్పున మృతి చెందారు. చీరాల వాడరేవులోని ఓ గెస్ట్‌ హౌస్‌లో ఉంటున్న గ్రావినా హెక్టర్ ఓమర్ (63) అనే అర్జెంటీనా జాతీయుడు వడదెబ్బకు తాళలేక మరణించాడు.

  • Loading...

More Telugu News