: వాళ్లిద్దరూ ఓవర్ కి పది చొప్పున బాదేశారు


ఐపీఎల్ సీజన్-8లో భాగంగా కోల్ కతాలో జరుగుతున్న మ్యాచ్ లో లెండిల్ సిమ్మన్స్, రోహిత్ శర్మ ఓవర్ కి పది పరుగుల చొప్పున బాదేశారు. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ కు దిగిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. పార్థివ్ పటేల్ డకౌట్ కావడంతో చెన్నై శిబిరం సంతోషించింది. సిమ్మన్స్ (68) కి జత కలిసిన రోహిత్ (50) విరుచుకుపడడంతో పన్నెండు ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు 120 పరుగులు చేసింది. ఈ దశలో అర్ధ సెంచరీలు చేసిన వీరిద్దరూ వరుస బంతుల్లో అవుటయ్యారు. క్రీజులో పోలార్డ్, రాయుడు ఉన్నారు. చెన్నై బౌలర్లలో స్మిత్, బ్రావ్ చెరో వికెట్ తీశారు. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి ముంబై మూడు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News