: ఆసుపత్రిలో భార్యపై భర్త హత్యాయత్నం


ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పట్టపగలు ఆసుపత్రిలో హత్యాయత్నం జరిగింది. వివరాల్లోకి వెళితే... ఐదు రోజుల క్రిందట ఓ మహిళపై సొంత భర్తే కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో బాధపడుతున్న ఆమెను స్థానికులు విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న ఆమె వద్దకు వచ్చిన భర్త, ఆమె గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఊపిరాడక ఆమె కేకలు వేయడంతో అతను పరారయ్యాడు. కాగా, ఆయనపై కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News