: సన్నీలియోన్, గూగుల్ సీఈవో లపై పోలీసు కేసులు


బాలీవుడ్ శృంగారతార సన్నీలియోన్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. జైపూర్ లో జైన్ అనే వ్యక్తి ఓ బాలీవుడ్ మేగజీన్ కొన్నారు. అందులో సన్నీలియోన్ హాట్ ఫోటోలతోపాటు ఆ మేగజీన్ వెబ్ సైట్ అడ్రస్ ఇచ్చారు. గూగుల్ సెర్చ్ లో ఆమె ఫోటోల కోసం వెతకగా, అందులో ఆమె వీడియోలు దర్శనమిచ్చాయి. దీంతో ఆయన మహిళల గౌరవానికి భంగం కలిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై సెక్షన్ 292, 292 ఏ, 294 కింద కేసులు నమోదు చేశారు. ఆమెతోపాటు గూగుల్ లో వీడియో దర్శనమివ్వడంతో గూగుల్ సీఈవో లారీపేజ్, ఆ మేగజీన్ యజమానిపై కూడా కేసులు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష, పది లక్షల జరిమానా పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News