: ఆశ్చర్యపరుస్తున్న బీట్ రూట్ బరువు


ఆ బీట్ రూట్ ల బరువు చూసి, వ్యవసాయాధికారులే ఆశ్చర్యపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. సాధారణంగా బీట్ రూట్ 250 గ్రాముల వరకు బరువు తూగుతుంది. మరీ పెద్దదైతే ఇంకాస్త బరువు తూగుతుంది. కానీ రామ్ పూర్ గ్రామంలో పూల్ సింగ్ అనే రైతు పండించిన బీట్ రూట్ ఒక్కోటి నాలుగు కేజీల బరువు తూగింది. ఇది తెలుసుకున్న వ్యవసాయాధికారులు ఆశ్చర్యపోయారు. అయితే పూల్ సింగ్ మాత్రం తాను పండించిన బీట్ రూట్ లు 70 క్వింటాళ్లు తూగుతాయని భావించానని, అవి కేవలం 50 క్వింటాళ్లే తూగి తనను నిరాశపరిచాయని చెప్పడం విశేషం.

  • Loading...

More Telugu News