: టీ20 మ్యాచ్ టికెట్లు దోచేశారు!
ఆరేళ్ల తరువాత సొంతగడ్డపై అంతర్జాతీయ మ్యాచ్ చూస్తున్న ఆనందం పాక్ క్రికెట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాం తెచ్చింది. పాక్, జింబాబ్వే టి20 మ్యాచ్ కోసం ఎప్పట్నుంచో ఎదురుచూసిన అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. దీంతో కొద్ది వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. బ్లాక్ లోనూ కొనేశారు. సుదీర్ఘ విరామం తరువాత జరుగుతున్న సిరీస్ కావడంతో అందరు వీరాభిమానులకు టికెట్లు దక్కలేదు. దీంతో ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కార్యాలయంలోకి చొరబడ్డారు. 1500 రూపాయల విలువ గల 600 టికెట్లు దోచేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేవలం 600 టికెట్లే కావడంతో పెద్దగా ఒత్తిడి తేవడం లేదు.