: పాక్ సహకరిస్తే సాధ్యమే: రాజ్ నాథ్ సింగ్
ప్రపంచంలో ఉగ్రవాదం అంతానికి పాకిస్థాన్ సహకరిస్తే తీవ్రవాద నిర్మూలన సాధ్యమేనని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాద నిర్మూలనలో పాకిస్థాన్, భారత్ తో కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. పాకిస్థాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని ఆయన తెలిపారు. పాక్ పూనుకుంటే ఉగ్రవాదం అంతం సాధ్యమేనని ఆయన చెప్పారు. కాగా, రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలపై పాక్ స్పందన గురించి ఆయన మాట్లాడుతూ, ఎవరు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నారో ప్రపంచానికి తెలుసని ఆయన చెప్పారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన తెలిపారు.