: ఖాట్మాండును వణికించిన మూడు భూకంపాలు
నేపాల్ రాజధాని ఖాట్మాండును మూడు భూకంపాలు వణికించాయి. 4.2, 4.4, 4.2 తీవ్రతతో సంభవించిన మూడు వరుస భూకంపాలు ఖాట్మాండు ప్రజలను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. తీవ్రత మరీ ఎక్కువ కాకపోవడంతో ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదని నేపాల్ వెల్లడించింది. కాగా, ఏప్రిల్ 25న సంభవించిన భూకంపం ధాటికి వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించగా, 9 వేల మందికి పైగా నేపాలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. నేపాల్ లోని ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు, వరదలకు కొండ చరియలు విరిగిపడి పలువురు మరణించిన సంగతి తెలిసిందే.