: 'గీతాంజలి' సినిమా అమెరికాలో నిజమైంది!
మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున, గిరిజ జంటగా నటించిన 'గీతాంజలి' సినిమా గుర్తుందా? ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న ఇద్దరు రోగులు ప్రేమలో పడతారు. ఎప్పుడు మరణిస్తారో తెలియదు కానీ జీవించినంతకాలం తోడు నీడగా జీవించాలని భావిస్తారు. అచ్చం అలాంటి ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ఓ ఇద్దరు రోగులు ప్రేమలో పడ్డారు. కలిసి జీవించాలని భావించి, వివాహం చేసుకున్నారు. ఫ్లోరిడాకు చెందిన జాన్ వేలీ, డెబీ రివేరా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గ్రీన్ కోవ్ స్ప్రింగ్స్ లోని గవర్నర్స్ క్రీక్ హెల్త్ సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. రెండు కాళ్లూ పనిచేయని స్థితిలో ఉన్న వీరిద్దరూ ఒకరికొకరుగా కలకాలం నిలవాలిన భావించి, కుటుంబ సభ్యుల సమక్షంలో ఆసుపత్రిలో వివాహం చేసుకున్నారు.