: 'ఎండల్లో హాయ్ హాయ్' అంటున్న బాలీవుడ్ తారలు!


వేసవిలో వేడిమిని తట్టుకోవడానికి దుస్తుల విషయంలో జగ్రత్తలు తీసుకుంటే హాయిగా ఉండొచ్చని చెబుతున్నారు బాలీవుడ్ తారలు. తానైతే ఈ కాలంలో బయటకు వెళితే, స్లీవ్ లెస్ దుస్తులు వేసుకుంటానని, అవైతే సౌకర్యవంతంగా ఉంటాయని చెబుతోంది శ్రధ్దా కపూర్. అనుష్క శర్మ అయితే కాటన్ స్కర్టు, కాటన్ షర్టుకే తన ఓటని చెప్పింది. కాటన్ దుస్తులు వేసవికి తగ్గట్టు సౌకర్యవంతంగా ఉంటాయని స్పష్టం చేసింది. ఇందులో వెరైటీ కావాలంటే ఓ కాటన్ కోటు తగిలిస్తానని అనుష్క తెలిపింది. బిపాసా బసు అయితే జీన్స్, కాటన్ షర్టుకే తన ప్రాధాన్యత అని తెలిపింది. కాటన్ దుస్తులు ఉండాల్సిందేనని, అయితే అవి వదులుగా ఉండాలని దీపికా పదుకునే పేర్కొంది.

  • Loading...

More Telugu News