: మ్యాగీపై పేలుతున్న జోకులు!


హానికారక లెడ్, గ్లూటామేట్ తదితరాలు ఉన్నాయన్న కారణంతో మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అధికారులు ప్రయత్నిస్తున్నారన్న వార్తలపై సామాజిక మాధ్యమాల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. కేవలం రెండు నిమిషాల్లో తయారయ్యే ఇన్ స్టంట్ ఫుడ్ గా నెస్లే మార్కెటింగ్ చేస్తున్న మ్యాగీకి భారత మార్కెట్లో మంచి పేరే ఉంది. 'మ్యాగీపై నిషేధం విధిస్తే సగం మంది భారతీయులు 'నాకోసం నేను వండుకోగలను' అని చెప్పే అవకాశం లేనట్టే' అని ఓ నెటిజన్ వ్యాఖ్యానిస్తే, ఆ వెంటనే మరొకరు స్పందిస్తూ, 'ఏం పర్వాలేదు, మెనూలో కోడిగుడ్డు ఉందిగా... ఉడకబెట్టుకోవడానికి' అని ట్వీట్ పెట్టారు. 'మ్యాగీపై నిషేధం విధిస్తారని స్పష్టమైతే రెండేళ్లకు సరిపడా ప్యాకెట్లను నేను ఇప్పుడే పరిగెత్తుకెళ్లి తెచ్చుకుంటా' అని ఒకరు, 'మ్యాగీ కన్నా అధిక మొత్తంలో విషాలున్న ఎన్నింటినో మనం తింటున్నాం' అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. కాగా, మార్కెట్ నుంచి ఏ మ్యాగీ ఉత్పత్తినీ వెనక్కు తీసుకోబోవడం లేదని నెస్లే స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News