: ఒంటిగంట సమయానికి 60 మంది మృతి... నీడలోనే ఉండమంటున్న అధికారులు


భానుడి ప్రకోపానికి ఆదివారం ఒంటిగంట సమయానికి తెలుగు రాష్ట్రాల్లో 60 మంది మృతి చెందారు. పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తున్నాయి. తీర ప్రాంతాల్లో వేడిగాలుల వల్ల ఎండలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు ఆదిలాబాద్ లో 48 డిగ్రీలు, నిజామాబాద్ లో 47.6 డిగ్రీలు, మచిలీపట్నంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని చోట్లా సాధారణం కంటే 3 నుంచి 7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకూ ప్రజలు నీడలోనే ఉండాలని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్త పడాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News