: తిరిగి తెరచుకోనున్న రిలయన్స్ పెట్రోలు బంకులు
గతంలో మూసేసిన పెట్రోలు బంకులను తిరిగి తెరవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించుకుంది. వచ్చే సంవత్సరం మార్చిలోగా మొత్తం 1400 ఔట్ లెట్లను ప్రారంభించాలని భావిస్తున్నట్టు సంస్థ తన వార్షిక నివేదికలో తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 ఔట్ లెట్లు పని చేస్తున్నాయని వివరించింది. 2006లో పెట్రోలు, డీజిల్ అమ్మకాలను ప్రారంభించిన రిలయన్స్ ప్రభుత్వ సంస్థలతో పోటీ పడలేక వాటిని మూసేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పెట్రోలు, డీజిల్ తదితరాలపై కేంద్ర నియంత్రణ లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలకు అనుగుణంగా విక్రయాలు సాగుతుంటే, రిలయన్స్ సైతం మరోసారి మార్కెట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది.