: అమితాబ్ కు 'థ్యాంక్స్' చెప్పిన మోదీ


నేపాల్ భూకంప బాధితుల సహాయం నిమిత్తం రూ. 11 లక్షల విరాళమిచ్చిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి బచ్చన్ విరాళం ఇవ్వగా, తన ట్విట్టర్ ఖాతాలో మోదీ కృతజ్ఞతలు తెలిపారు. నేపాల్ ను అతలాకుతలం చేసిన భూకంపం, ఇప్పటివరకూ 9 వేలకు పైగా ప్రజల ప్రాణాలను బలిగొంది. నేపాల్ కు సాయం చేసేందుకు భారతీయులు పెద్దఎత్తున ముందుకు వచ్చారు. ఎన్నో ఎన్జీవో సంస్థలు నిధులను, పునరావాస సామగ్రినీ సమీకరించి నేపాల్ కు పంపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News