: మూసీ పొడవునా ఆకాశమార్గం... తొలి అడుగు వేసిన జీహెచ్ఎంసీ


హైదరాబాదు నగరంలో మరో భారీ ప్రాజెక్టుకు రంగం సిద్ధమైంది. మూసీ నది పొడవునా స్కైవే నిర్మించడం ద్వారా సిగ్నల్ రహిత సాఫీ ప్రయాణానికి అవకాశం కల్పించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ నిర్మాణం ఎలా ఉండాలి? ఎంత ఖర్చవుతుంది? డిజైన్ తదితర కన్సల్టెన్సీ సేవల కోసం టెండర్లను ఆహ్వానించింది. టెండరు గెలిచిన సంస్థ దాదాపు 41 కిలోమీటర్ల పొడవైన ఈ ఆకాశమార్గానికి సంబంధించిన స్టడీ నివేదికను నెల రోజుల్లోగా అందజేయాల్సి వుంటుంది. టెండర్లకు సంబంధించిన ప్రీ బిడ్ సమావేశం ఈనెల 27న జరగనుండగా, టెండరు దాఖలుకు జూన్ 6 చివరి తేదీగా జీహెచ్ఎంసీ పేర్కొంది. స్కైవేకు సంబంధించి రోడ్డు సైనేజీలు, పేవ్‌ మెంట్ మార్కింగ్‌ లు, రైలింగ్‌ లు, సేఫ్టీ బారియర్లు తదితరమైన వాటిని కూడా నివేదికలో సవివరంగా వెల్లడించాల్సి వుంటుంది.

  • Loading...

More Telugu News