: ప్రాణాలు తోడేస్తున్న ఉగ్ర కిరణాలు... నిన్న ఒక్కరోజులో 642 మంది మృతి
చండ్రనిప్పులను తలపించే కిరణాలతో సూర్యుడు తెలుగు రాష్ట్రాలపై ప్రతాపం చూపుతున్నాడు. ఎండ వేడికి తాళలేక శనివారం ఒక్కరోజే తెలంగాణలో 251 మంది, ఆంధ్రప్రదేశ్ లో 391 మంది మరణించారు. వడగాలుల తీవ్రతతో అన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రత నమోదవుతోంది. నిజామాబాద్, రామగుండం తదితర చోట్ల 48 డిగ్రీల వేడి నమోదైంది. కాగా, ఇంతటి ఎండలో బయట తిరగడం అత్యంత ప్రమాదమని, తప్పనిసరైతే మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్లాలని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఎండలో పనిచేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరో వారం రోజుల పాటు ఇదే విధమైన పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.