: భారత్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై పాక్ ఆందోళన
తీవ్రవాదులను తీవ్రవాదులతోనే మట్టుబెట్టాలని భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవైపు తాము ఇండియాతో సత్సంబంధాలు కోరుకుంటుంటే, సాక్షాత్తూ రక్షణ మంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తోందని పాకిస్థాన్ జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. తీవ్రవాదం కారణంగా ఇండియాతో పోలిస్తే తమ దేశమే అధికంగా నష్టపోయిందన్న అజీజ్, రెండు దేశాల ఉమ్మడి శత్రువుగా ఉన్న తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు కలిసి పోరాడాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు.