: ఆ మహాకవి నివాసం ఇక చారిత్రక కట్టడం!


మహాకవిగా, నవయుగ వైతాళికుడిగా ప్రఖ్యాతిగాంచిన గురజాడ అప్పారావు నివసించిన ఇంటికి విశిష్ట గుర్తింపు లభించింది. విజయనగరంలోని ఆయన గృహాన్ని చారిత్రక కట్టడంగా, ఆ గృహ సముదాయాన్ని పురావస్తు కట్టడంగా గుర్తించినట్టు పురావస్తు శాఖ ఒక ప్రకటన వెలువరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ జీఓ నంబర్-8ను విడుదల చేశారు. దీని ప్రకారం గురజాడ గృహాన్ని చారిత్రక కట్టడంగా, పురావస్తు ప్రదేశంగా గుర్తిస్తూ గెజిట్ పబ్లికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై గురజాడ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News