: ఇదో జిత్తులమారి నక్షత్రమట!


గతంలో ఎన్నడూ చూడని విధంగా చాలా త్వరగా తన స్వరూపాన్ని మార్చేసుకుంటున్న ఓ నక్షత్రాన్ని నాసా హబుల్ టెలిస్కోప్ గుర్తించింది. ఈ నక్షత్రం తీరును చూసి దానికి 'నాస్టీ 1' అని పేరు పెట్టారు. ఈ నక్షత్రం జిత్తులమారిదట. మన సూర్యుడితో పోలిస్తే, అధిక బరువున్న ఈ నక్షత్రం ప్రస్తుతం పరివర్తక దశలో ఉంది. కొంత కాలం క్రితం దీన్ని గుర్తించగా, అప్పటి నుంచి దీన్ని గమనిస్తున్న సైంటిస్టులు దీని ప్రవర్తనకు విస్తుపోతున్నారు. ఈ నక్షత్రం తనచుట్టూ ఉన్న హైడ్రోజన్ నిండిన లేయర్లను చాలా త్వరగా కోల్పోతోంది. దీంతో ఈ నక్షత్రం అత్యధిక వేడిని వెదజల్లుతోంది. దీనిచుట్టూ రెండు లక్షల కోట్ల మైళ్ల పొడవులో వివిధ వాయువులు పాన్ కేక్ తరహాలో చుట్టుముట్టి ఉన్నాయని హబుల్ వెల్లడించింది. ఈ నక్షత్రం కొన్ని వేల సంవత్సరాల క్రితమే పుట్టిందని, మరో 10 వేల సంవత్సరాల వరకూ మాత్రమే వాయువులతో కూడిన డిస్క్ కనిపిస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు. ఈ నక్షత్రాన్ని పరిశీలిస్తూ, దానిలో మార్పులను పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు.

  • Loading...

More Telugu News