: ఉద్యోగులకు కార్లను రివార్డుగా ఇచ్చిన స్టార్టప్


కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్నాయి. తమ ఉద్యోగులకు రూ. 200 కోట్ల విలువైన వాటాలను 'హౌసింగ్ డాట్ కామ్' సీఈఓ రాహుల్ యాదవ్ రాసిచ్చిన ఘటన మరువక ముందే, స్టార్టప్ సంస్థ హెకిల్ టెక్నాలజీస్ ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చింది. హ్యుందాయ్ యాక్సెంట్, ఐ10 గ్రాండ్ లను నలుగురు ఉద్యోగులకు రివార్డుగా ఇచ్చినట్టు ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం హెకిల్ లో 23 మంది మాత్రమే పనిచేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన సంస్థకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్, రిలయన్స్ సెక్యూరిటీస్, ఇండియా ఇన్ఫోలైన్, ఎడిల్ వైస్ తదితర పెద్ద పెద్ద క్లయింట్లున్నారు. వీరికి ఫైనాన్షియల్ డేటా సేవలను హెకిల్ అందిస్తోంది.

  • Loading...

More Telugu News