: 'దబాంగ్' సినిమా డైలాగులు కొడుతున్న హర్యాణా మంత్రి


హర్యాణా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ సందర్భోచితంగా 'దబాంగ్' సినిమాలోని సల్మాన్ ఖాన్ స్టయిల్లో డైలాగులు విసురుతూ ప్రజలను అలరిస్తున్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రి రేసులో నిలిచినప్పడు, మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ, 'నేను ముఖ్యమంత్రినైతే నీ సంగతేంటి హుడా...'(తేరా క్యా హోగా కాలియా) అంటూ ఆకట్టుకున్నారు. తాజాగా, భ్రూణహత్యలకు కారణమవుతున్న లింగనిర్ధారణ పరీక్షలపై ఆయన అదే సినిమాలో మరో డైలాగ్ కొట్టారు. ఎవరైనా లింగనిర్ధారణ పరీక్షలకు ఆల్ట్రాసౌండ్ ల్యాబ్ లకు వెళ్తే...'అక్కడి వైద్యులు, పారిపోండి... లేకపోతే అనిల్ విజ్ వచ్చి మీ అంతు చూస్తాడు' (మైనే ఐసే హాలాత్ ఫైదా కర్ నా చాతాహూ కీ జబ్ దూర్ దూర్ తక్ కోయీ ఆల్ట్రాసౌండ్ సెంటర్ జాయేతో డాక్టర్ కహేగా భాగ్ జా నహీతో అనిల్ విజ్ ఆయేగా) అంటారని చెప్పారు.

  • Loading...

More Telugu News