: ఏపీలో ఎండలు ఇలా ఉన్నాయి
ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎండల వేడిమికి తట్టుకోలేక ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు- వేల్పూరు రహదారిలో ఉన్న సబ్ స్టేషన్ లో రెండు ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయాయి. దీంతో, తణుకు పట్టణంతో పాటు, ఏడు మండలాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. అసలే మండుతున్న ఎండలు, విద్యుత్ లేకపోవడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. దీంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయే రీతిలో ఎండలు ఉన్నాయంటే తెలుగు రాష్ట్ర ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.