: కేసీఆర్! ఓయూ భూములు కాదు, సెజ్ లు ఖాళీగా ఉన్నాయి, చూడు: వీహెచ్
పేదలకు ఇళ్లు కట్టేందుకు ఉస్మానియా యూనివర్సిటీ భూములు అవసరం లేదని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయలేనిది టీఆర్ఎస్ కొత్తగా ఏం చేసిందని నిలదీశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేలు చేస్తాడని ప్రజలు ఎన్నో ఆశలతో అధికారం అప్పగించారని, మరి కేసీఆర్ పేదల సంక్షేమానికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. పేదలకు ఇళ్లు కట్టేందుకు ఓయూ భూములే అవసరం లేదని, ఖాళీ సెజ్ లలో కట్టవచ్చని ఆయన కేసీఆర్ కు సూచించారు.